వాయిదా పడిన రామ్ గోపాల్ వర్మ చిత్ర ఆడియో?

వాయిదా పడిన రామ్ గోపాల్ వర్మ చిత్ర ఆడియో?

Published on Apr 17, 2015 11:50 AM IST

365days

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం ‘365 డేస్’ చిత్రం ఆడియో ఏప్రిల్ 18న కానుందని మేము ప్రకటించాం. అయితే తాజా సమాచారం ప్రకారం ఆడియో ఈ నెల 23న విడుదలకానుంది.

అంతేకాకుండా నిర్మాతలు ఈ చిత్ర ఆడియోని కొత్త తరహాలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుత తరం పెళ్లి గొడవల పై చిత్రీకరించారు. టాలీవుడ్ మరియు బాలీవుడ్ లో ప్రముఖలైన కొత్త జంటలని ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. అయితే ఇంకా అధికారిక ప్రకటన విడుదల కావాల్సివుంది.

నాగ్ శ్రీవత్స సంగీతం అందించిన ఈ చిత్రం లో నందూ, అనైక సోటి హీరో హీరోయిన్ లుగా నటించారు. ఆడియో లాంచ్ జరిగే చోటు గురించిన సమాచారం విడుదల కావాల్సివుంది. మరిన్ని వివారాల కోసం 123తెలుగుని చూస్తూవుండండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు