‘అవును -2’ సినిమాకు ‘ఏ’ సర్టిఫికేట్

‘అవును -2’ సినిమాకు ‘ఏ’ సర్టిఫికేట్

Published on Mar 29, 2015 8:02 PM IST

Avunu2
వినూత్న చిత్రాల ద్వారా సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శక నటుడు.. రవిబాబు. ఇప్పటివరకూ ఆయన తీసిన సినిమాలు కొత్తదనంతో ఆకట్టుకోవడమే కాక మంచి విజయాలుగానూ నిలిచాయి. ఆయన దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం.. ‘అవును 2’. రవిబాబు దర్శకత్వం వహించగా హర్షవర్ధన్ రానే, పూర్ణ ప్రధాన పాత్రల్లో నటించగా 2012లో విడుదలై ఘనవిజయం సాధించిన ‘అవును’ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందింది. ఏప్రిల్ 3న ఈ సినిమా విడుదలవనున్న విషయం తెలిసిందే.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. పూర్తి హార్రర్ సినిమాగా తెరకెక్కిన ’అవును 2’కు సెన్సార్ బృందం ‘ఏ’ సర్టిఫికేట్ జారీ చేసింది. ఫ్లైయింగ్ ఫ్రాగ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మించబడ్డ ఈ సినిమాను ప్రముఖ నిర్మార డి. సురేష్ బాబు విడుదల చేయనుండడం విశేషం. పోస్టర్, టీజర్ విడుదలైనప్పటి నుంచే ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి కలిగింది. వేసవి సెలవుల్లో రానుండడం ఈ సినిమాకు మరింత కలిసివచ్చే అంశం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు