హిట్ నిర్మాతకు బి. నాగిరెడ్డి మెమోరియల్ అవార్డ్ !

హిట్ నిర్మాతకు బి. నాగిరెడ్డి మెమోరియల్ అవార్డ్ !

Published on Mar 19, 2017 4:12 PM IST


గతేడాది ఘన విజయం సాధించిన సినిమాల్లో ‘పెళ్లి చూపులు’ కూడా ఒకటి. అత్యంత తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం ఊహకందని రీతిలో పదింతలు వసూళ్లను సాధించి నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంట పండించింది. చిన్న సినిమా పనితనం ఎలా ఉండాలి అంటే అందరూ ‘పెళ్లి చూపులు’ లా ఉండాలి అంతేగా ఈ సినిమా పాపులర్ అయింది. మంచి కథతో, ఫ్యామిలీ, రొమాంటిక్, కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేయగా రాజ్ కందుకూరి నిర్మించారు.

అంత మంచి విలువలున్న సినిమాను నిర్మించినందుకు గాను రాజ్ కందుకూరి విశిష్ట పురస్కారం బి. మెమోరియల్ అవార్డు దక్కనుంది. బి.నాగిరెడ్డి కుమారుడు, విజయ వాహిని స్టూడియోస్ వ్యవహార భాద్యతలు చూసుకుంటున్న బి. వెంకట్రామిరెడ్డి గత 6 సంవత్సరాల నుండి మంచి కుటుంబ విలువలున్న సినిమాలను నిర్మించే నిర్మాతలకు ఈ అవార్డును బహుకరిస్తున్నారు. కాగా 2016వ సంవత్సరానికి గాను ఈ రాజ్ కందుకూరికి ఏప్రిల్ 16న ఈ అవార్డును రాజమండ్రిలో అందజేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు