హిందీలో కూడా షూట్ చేయనున్న ‘బాహుబలి 2’

హిందీలో కూడా షూట్ చేయనున్న ‘బాహుబలి 2’

Published on Oct 4, 2015 6:26 PM IST

baahubali11
ఈ ఏడాది టాలీవుడ్ స్థాయిని సౌత్ నుంచి హాలీవుడ్ కి పరిచయం చేసిన సినిమా ‘బాహుబలి’. పేరుకి మాత్రమే కాదు కలెక్షన్స్ పరంగా కూడా బాక్స్ ఆఫీసుని షేక్ చేసి 600 కోట్ల గ్రాస్ మార్క్ ని క్రాస్ చేసింది. ఇది చాలదన్నట్టు ఇప్పుడు ఇంటర్నేషనల్ గా కూడా రిలీజ్ అవ్వడానికి సిద్దమైంది. బాహుబలి సక్సెస్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న రాజమౌళి ఇటీవలే బాహుబలి పార్ట్ 2 కి సంబందించిన వర్క్స్ మొదలు పెట్టాడు. అంతే కాకుండా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ని కూడా జోరుగా ఫినిష్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే బాహుబలి మొదటి పార్ట్ ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించి హిందీ, మలయాళంలో డబ్బింగ్ చేసి రిలీజ్ చేసారు. కానీ ఈ సారి రాజమౌళి తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా షూట్ చేయాలనుకుంటున్నట్లు సమాచారం. హిందీలో ఈ సినిమాకి సూపర్బ్ ఓపెనింగ్స్ వచ్చాయి. 100 కోట్ల మార్క్ ని కూడా దాటింది. దాంతో సెకండ్ పార్ట్ ని ఫుల్ క్వాలిటీతో హిందీలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నారు. మరి ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ రానుంది. బాహుబలి రెండవ పార్ట్ ఫస్ట్ పార్ట్ కన్నా బెటర్ గా ఉండాలని వార్ ఎపిసోడ్ ని మళ్ళీ రీ డిజైన్ చేస్తున్నాడు. అక్టోబర్ చివర్లో లేదా నవంబర్లో బాహుబలి 2 సెట్స్ పైకి వెళ్లనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు