ఇండియాలో ‘బాహుబలి’ మొదటి రోజు నెట్ బిజినెస్ ఎంతంటే !

ఇండియాలో ‘బాహుబలి’ మొదటి రోజు నెట్ బిజినెస్ ఎంతంటే !

Published on Apr 30, 2017 1:58 PM IST


అందరూ అనుకున్నట్టే ‘బాహుబలి-2’ చిత్రం ప్రభంజనం సృష్టిస్తోంది. రాజమౌళి అండ్ టీమ్ సుమారు 5 ఏళ్లు చెమటోడ్చి రూపిందించిన బాహుబలి ప్రాంచైజీలో రెండవది, ఆఖరిది అయిన ఈ చిత్రం సినీ ప్రేమికుల్ని ఉర్రూతలూగిస్తోంది. మొదటిరోజు ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా 8000 స్క్రీన్లలో విడుదలైన ఈ చిత్రం ఒక్క ఇండియాలో మాత్రమే 6500 స్క్రీన్లలో ప్రదర్శితమైంది. దీంతో ఇండియాలో ఈ చిత్రం యొక్క మొదటి రోజు వసూళ్లు కళ్ళు చెదిరే రీతిలో ఉన్నాయి.

తాజాగా అందుతున్న విశ్వసనీయమైన సమాచారం ప్రకారం ఈ దృశ్య కావ్యం మొదటిరోజు రూ. 121 కోట్ల నెట్ బిజినెస్ జరిపింది. ఇందులో తెలుగు, తమిళ్, మలయాళ వెర్షన్ల వాటా రూ. 81 కోట్లుగా ఉండగా హిందీ వెర్షన్ రూ. 41 కోట్లు వసూలు చేసింది. ఇప్పటి వరకు ఇండియాలో ఇంత భారీ మొత్తం వసూలు చేసిన చిత్రం ఇదే కావడం తెలుగు పరిశ్రమ గర్వించదగ్గ విషయం. సినిమాకు గొప్ప పాజిటివ్ టాక్ వ్యాపించడంతో ఈ వసూళ్లు ఇలాగే నిలకడగా కొనసాగే అవకాశాముంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు