జపాన్ లో విడుదలకానున్న ‘బాహుబలి-2’ !

జపాన్ లో విడుదలకానున్న ‘బాహుబలి-2’ !

Published on Dec 11, 2017 5:49 PM IST

తెలుగు సినిమా ఖ్యాతిని నలుదిశలా వ్యాప్తి చేసిన చిత్రం ‘బాహుబలి – ది కన్ క్లూజన్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1600 కోట్లను వసూలు చేసింది. అప్పటి వరకు ఉన్న టాప్ హిందీ సినిమా రికార్డులన్నింటినీ చెరిపేసిన ఈ సినిమా కొత్త హరిత్రను సృష్టించింది.

ఇప్పుడు ఈ సినిమాను జపాన్ లో కూడా రిలీజ్ చేయనున్నారు. అక్కడి అధికారులు ఈ సినిమాకు ‘జి’ రేటింగ్ ఇచ్చారు. ‘జి’ అనగా మన క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ తో సమానం. డిసెంబర్ 29 న ఈ జపనీస్ వెర్షన్ రిలీజ్ కానుంది. ఒక జపాన్ లోనే కాక చైనా, కొరియాలలో కూడా సినిమా విడుదలకానుంది. మరి ఈ సినిమా ఇతర దేశాల్లో ఎలాంటి రికార్డుల్ని సృష్టిస్తే చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు