‘బాహుబలి’ మూడు వారాల కలెక్షన్స్ రిపోర్ట్!

‘బాహుబలి’ మూడు వారాల కలెక్షన్స్ రిపోర్ట్!

Published on Aug 1, 2015 7:54 PM IST

baahubali
తెలుగులో ఒక సినిమా కలెక్షన్ల పరంగా సునామీ సృష్టిస్తోంది. విడుదలై మూడు వారాలైనా అదే ఊపుతో ఆ సినిమా దూసుకుపోతోంది. ఆ సినిమాయే దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘బాహుబలి’. ఒక్క తెలుగులోనే కాక తమిళం, మళయాలం, హిందీ ఇలా విడుదలైన అన్ని భాషల్లో, అన్ని ప్రదేశాల్లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోందీ సినిమా. మూడో వారం ముగిసేసరికి ఈ సినిమా తెలుగులో (ఏపీ&తెలంగాణ), హిందీలో 100 కోట్ల మార్క్‌కు అత్యంత దగ్గరకు చేరింది.

మొత్తం 21 రోజుల్లో ఈ సినిమా హిందీ వర్షన్ 95.76 కోట్ల రూపాయలు కొల్లగొట్టి వంద కోట్ల మార్క్‌కు దగ్గరైన విషయం తెలిసిందే! ఇక తెలుగు నాట కూడా ఈ సినిమా అదే స్థాయి కలెక్షన్లను కొల్లగొడుతూ వంద కోట్ల మార్క్‌కు దగ్గరైంది. తెలుగులో ‘బాహుబలి’ సినిమా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాల్లో కలిపి 97.03 కోట్ల రూపాయల షేర్ సాధించింది. ఇది తెలుగు సినిమా ఊహకు కూడా అందని కలెక్షన్లు అనడంలో అతిశయోక్తి లేదు. ఇదే స్థాయిలో ఆగష్టు 7 వరకూ ‘బాహుబలి’ కలెక్షన్ల జోరు ఇలాగే కొనసాగుతుందనడంలో సందేహం లేదు. ఒక్క ఏపీ, తెలంగాణాల్లోనే ఓ సినిమా వంద కోట్ల మార్క్ చేరుకోనుందంటే అది రికార్డులకే రికార్డ్!

ఇక ప్రాంతాల వారీగా ‘బాహుబలి’ 21 రోజుల కలెక్షన్ల (షేర్) వివరాలు..

ఏరియా కలెక్షన్స్
నైజాం 35.99 కోట్లు
సీడెడ్ 19.73 కోట్లు
నెల్లూరు 3.75 కోట్లు
తూర్పు గోదావరి 7.94 కోట్లు
పశ్చిమ గోదావరి 6.38 కోట్లు
వైజాగ్ 8.54 కోట్లు
కృష్ణ 6.08  కోట్లు
గుంటూరు 8.62 కోట్లు
మొత్తం(షేర్) 97.03cr కోట్లు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు