తన దర్శకత్వంపై క్లారిటీ ఇచ్చిన సెంథిల్ కుమార్ !

తన దర్శకత్వంపై క్లారిటీ ఇచ్చిన సెంథిల్ కుమార్ !

Published on Apr 24, 2017 5:07 PM IST


దర్శక ధీరుడు రాజమౌళి సృష్టించిన ‘బాహుబలి’ అనే విజువల్ వండర్ వెనుక సినిమాటోగ్రఫర్ సెంథిల్ కుమార్ కృషి అసమాన్యం. రాజమౌళి ఊహలకు దృశ్య రూపమివ్వగల అత్యంత సమర్థుడు ఆయనొక్కరే. ఈ సక్సెస్ కు కారణం వారిద్దరి మధ్య ఉన్న 13 ఏళ్ల ప్రయాణ బంధం. ఈ బాహుబలి చిత్రంతో దక్షిణాది పరిశ్రమకు ఐమాక్స్ టెక్నాలజీని పరిచయం చేయడమేగాక, ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన సెంథిల్ కుమార్ కు ఫిల్మ్ ఇన్టిట్యూట్ లో చదువుకునేటప్పటి నుండి దర్శకుడవ్వాలనే కోరిక బలంగా ఉండేది.

పలు సందర్భాల్లో ఈ మాటను చెప్పారు కూడ. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన మరోసారి తన దర్శకత్వం టాపిక్ రాగానే ఆసక్తికరమైన అంశాన్ని చెప్పారు. అదేమిటంటే రాజమౌళి కష్టాన్ని చూసిన తర్వాత ఇంకా తానూ నేర్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయని తెలుసుకున్నానని, అవన్నీ నేర్చుకున్న తర్వాత దర్శకత్వం చేస్తానని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు