చెన్నైలో నాలుగో వారమూ ‘బాహుబలి’దే టాప్ ప్లేస్!

చెన్నైలో నాలుగో వారమూ ‘బాహుబలి’దే టాప్ ప్లేస్!

Published on Aug 3, 2015 4:05 PM IST

baahubali11
దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘బాహుబలి’ నాలుగో వారంలోనూ అదే జోరు కొనసాగిస్తూ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. తెలుగు, తమిళం, హిందీ, మళయాలం.. ఇలా ఏ భాష అనే విషయంతో సంబంధం లేకుండా విడుదలైన అన్ని చోట్లా సంచలనాలు సృష్టిస్తూ, నాలుగో వారాంతం కూడా ఈ సినిమా టాప్‌లో నిలిచింది. తెలుగు, హిందీల్లో ఇప్పటికే వంద కోట్ల మార్క్ చేరుకున్న ఈ సినిమా తమిళంలోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

ప్రధానంగా కోలీవుడ్‌లో అక్కడి స్టార్ హీరోల సినిమాలను సైతం వెనక్కి నెట్టి ‘బాహుబలి’ టాప్‌లో నిలవడం విశేషం. నాలుగో వారాంతం కూడా అద్భుతమైన కలెక్షన్లు కొల్లగొడుతూ ‘బాహుబలి’, ఇతర తమిళ సినిమాలను పక్కన నెట్టేసి నెంబర్ స్థానంలో నిలబడింది. ఈ ఏడాది తమిళంలో విడుదలైన సినిమాల్లో చెన్నై నగరంలో బాక్స్ ఆఫీస్ వద్ద టాప్ ప్లేస్‌లో శంకర్ ‘ఐ’ (8 కోట్లు) సినిమా నిలవగా, ‘బాహుబలి’ నాలుగో వారాంతం ముగిసేసరికి 6.70 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. త్వరలోనే బాహుబలి, ఐ రికార్డును కూడా బ్రేక్ చేయనుందని ట్రేడ్ వర్గాల అంచనా!

సంబంధిత సమాచారం

తాజా వార్తలు