‘బాహుబలి’ హిందీ రిపోర్ట్ : ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్!

‘బాహుబలి’ హిందీ రిపోర్ట్ : ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్!

Published on Jul 31, 2015 5:20 PM IST

baahubali11
దర్శకుడు రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి’ సినిమా విడుదలైన అన్నిచోట్లా రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతూ ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. తెలుగు, తమిళ, హిందీ, మళయాలం ఇలా అన్ని భాషల్లో జూలై 10న భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమా మూడో వారం దాటి నేటితో నాలుగో వారంలోకి ప్రవేశించినా అదే ఊపుతో దూసుకుపోతోంది. తెలుగులో పెద్ద సినిమాలేవీ లేకపోయినా తమిళం, హిందీల్లో మాత్రం పలు పెద్ద సినిమాలు బాహుబలి ఊపును తగ్గిస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమైనా, వాటన్నింటికీ భిన్నంగా సినిమా ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా నిలబడింది.

ఇక ప్రధానంగా బాలీవుడ్‌లో డబ్బింగ్ సినిమాలకు అంతంతమాత్రమే ఆదరణ ఉన్న నేపథ్యంలోనే విడుదలై అక్కడా సంచలనాలు నమోదు చేయడం బాహుబలి సినిమాకే చెల్లింది. వేరే ఏ ఇతర సినిమాల ఊహకు కూడా అందనంతగా మూడో వారం ముగిసేసరికి ‘బాహుబలి’ 95.76 కోట్ల రూపాయాలు వసూలు చేసింది. ఇక సల్మాన్ ఖాన్ సినిమా ‘భజరంగీ భైజాన్’ ఓ పక్క కలెక్షన్ల వర్షం కురిపిస్తూ హిందీ సినిమా రికార్డులను తిరగరాస్తున్నా, మరోపక్క ‘బాహుబలి’ కూడా స్ట్రాంగ్‌గా నిలబడడం విశేషంగా కనిపిస్తోంది. ఈ వారాంతం కల్లా బాహుబలి 100 కోట్ల మార్క్ చేరుకుంటుందని ట్రేడ్ వర్గాల అంచనా!

సంబంధిత సమాచారం

తాజా వార్తలు