‘బాహుబలి’, ‘గోపాల గోపాల’కి మాత్రం నో బ్రేక్.!

‘బాహుబలి’, ‘గోపాల గోపాల’కి మాత్రం నో బ్రేక్.!

Published on Oct 20, 2014 2:30 PM IST

gopala-bhahubali
గత వారం రోజుల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలోని వర్కర్స్ యూనియన్ తన జీతాలను పెంచాలని చేస్తున్న స్ట్రైక్ వల్ల ఎక్కడి సినిమాలు అక్కడే ఆగిపోయాయి. ఈ స్ట్రైక్ ఎఫెక్ట్ వల్ల నేటి నుంచి గోవాలో ప్రారంభం కావాల్సిన ఎన్.టి.ఆర్ – పూరి జగన్నాధ్ మూవీ షెడ్యూల్ కూడా ఆగిపోయింది. ఇలా వర్కర్స్ స్ట్రైక్ వల్ల అన్ని సినిమాలు ఆగిపోయినా రెండు సినిమాల మాత్రం షూటింగ్ ఆగలేదు. అవే ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘బాహుబలి’ మరియు వెంకటేష్ – పవన్ కళ్యాణ్ ల ‘గోపాల గోపాల’.

రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘బాహుబలి’ షూటింగ్ మాత్రం ఆగకుండా రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. అలాగే పవన్ కళ్యాణ్ – వెంకటేష్ కలిసి నటిస్తున్న ‘గోపాల గోపాల’ సినిమా షూటింగ్ కూడా ఆగకుండా రామానాయుడు స్టూడియోస్ లో వేసిన సెట్ లో జరుగుతోంది. అన్ని సినిమాల షూటింగ్ ఆగిపోయినా, ఈ రెండు సినిమాల షూటింగ్ మాత్రం ఆగకుండా ఎలా జరుగుతున్నాయా అని ఇండస్ట్రీలోని పలువురు షాక్ అవుతున్నారు.

ప్రస్తుతం తెలుగు చిత్ర నిర్మాణ మండలి మరియు వర్కర్స్ యూనియన్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చర్చలు ఫలిచించి అన్ని సినిమా షూటింగ్స్ రీ స్టార్ట్ అవుతాయని ఇండస్ట్రీ వర్గాలు ఆశిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు