భుసన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘బాహుబలి’..!

భుసన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘బాహుబలి’..!

Published on Aug 28, 2015 7:00 PM IST

Baahubali-pposter
దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన బాహుబలి, దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించడమే కాక, ఇండియన్ సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన విషయం తెలిసిందే. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలు ప్రధాన పాత్రల్లో నటించగా, ఆర్కా మీడియా వర్క్స్ నిర్మించిన ఈ సినిమా జూలై 10వ తేదీన విడుదలై నేటితో యాభై రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటికే పలు హాలీవుడ్ పత్రికలు సైతం బాహుబలి సినిమాపై ప్రశంసల వర్షం కురిపించగా తాజాగా ఫిల్మ్ ఫెస్టివల్స్‌కి కూడా ఈ సినిమా ఎంపికై మరిన్ని విశేషాలను నింపుకుంది.

రాజమౌళి విజన్, సెట్టింగ్స్, హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్‌తో అలరించిన బాహుబలి తాజాగా భుసన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైంది. ప్రఖ్యాత భుసన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాహుబలి సినిమా ప్రదర్శితం కానున్న విషయాన్ని రాజమౌళి స్వయంగా తెలియజేశారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘బాహుబలి’ సినిమా, అక్టోబర్ 4, 7, 9వ తేదీల్లో ప్రదర్శితం కానుంది. అక్టోబర్ 4న జరిగే ప్రదర్శనకు రాజమౌళి స్వయంగా హాజరు కానున్నారు. రాజమౌళితో పాటు సినిమా నిర్మాతలు, టీమ్ కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్నిచోట్లా రికార్డుల మోత మోగించిన ఈ సినిమా ఇప్పుడు ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు కూడా ఎంపికవ్వడం ఆనందించదగ్గ విషయం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు