‘బాహుబలి’ని ఆ సినిమాతో పోల్చడం అద్భుతం – రానా

‘బాహుబలి’ని ఆ సినిమాతో పోల్చడం అద్భుతం – రానా

Published on Jul 6, 2015 8:36 AM IST

rana2

నాలుగు రోజులు మాత్రమే.. ఇక కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉంది.. ఇండియన్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ ‘బాహుబలి’ రిలీజ్ అవ్వడానికి.. ప్రస్తుతం ఈ చిత్ర టెక్నికల్ టీం అంతా ఫైనల్ కాపీని సిద్దం చేసే పనిలో బిజీగా ఉంటే, స్టార్స్ అందరూ సినిమాని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. జూలై 10న బాహుబలి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. రాజమౌళి.. ఈయన సినిమాల్లో హీరో ఎలా ఉన్నా విలన్ మాత్రం మునుపెన్నడూ చూడని స్థాయిలో, బాగా బలంగా, క్రూరంగా ఉంటాడు. విలన్ అలా ఉంటేనే హీరోయిజం హైలైట్ అవుతుందని నమ్ముతాడు. అలా ఇప్పటికే చాలా మంది విలన్స్ ని తెలుగుకి పరిచయం చేసాడు.

బాహుబలి సినిమాతో మనకు పరిచయం ఉన్న ఆరడుగుల హీరోని విలన్ గా మార్చి చూపించాడు. అతనే మన భళ్లాలదేవ అలియా రానా దగ్గుబాటి. ఇప్పటివరకూ రిలీజ్ అయిన ట్రైలర్స్ లోనే రానా లుక్ అండ్ పెర్ఫార్మన్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ ఉంది. హాలీవుడ్ పరంగా విజువల్స్ తో వండర్ చేసిన సినిమా ‘అవతార్’. చాలా మంది బాహుబలిని ఇండియన్ అవతార్ అని అంటున్నారు దేనిపై మీ కామెంట్ ఏంటి అని రానాని అడిగితే ‘ అవతార్ అనేది ప్రపంచంలోనే అథ పెద్ద సినిమా, అందరూ మెచ్చిన సినిమా. అలాంటి సినిమాతో బాహుబలిని పోల్చడం అద్భుతంగా అనిపిస్తోంది. నా పరంగా చూస్తే బాహుబలి అనేది ఓ సినిమా కాదు అదో గొప్ప అనుభూతి’ అని రానా తెలిపాడు.

ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ బాహుబలి సినిమాలో ప్రభాస్, రానా అన్నదమ్ములుగా కనిపించనుంటే, అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా కనిపించనున్నారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ గా సాబు సిరిల్ పనిచేసారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు