సీడెడ్ లో ల్యాండ్ మార్క్ క్రియేట్ చేసిన బాహుబలి

సీడెడ్ లో ల్యాండ్ మార్క్ క్రియేట్ చేసిన బాహుబలి

Published on Aug 3, 2015 4:27 PM IST

baahu-bali
సౌత్ ఇండియన్ ఆల్ టైం రికార్డ్స్ అన్నిటినీ బ్రేక్ చేసుకుంటూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన గ్రాఫికల్ విజువల్ వండర్ ‘బాహుబలి’. అభిమానుల్లో ఉండే భారీ అంచనాలను అందుకొని బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపించిన, కురిపిస్తోన్న సినిమానే బాహుబలి. విడుదలై నాలుగవ వారంలోకి అడుగుపెట్టినా బాక్స్ ఆఫీసు వద్ద మాత్రం కలెక్షన్స్ చాలా బాగా వస్తున్నాయి. ఎస్ఎస్ రాజమౌళి – ప్రభాస్ – రానా – అనుష్క – తమన్నాల క్రేజీ కాంబినేషన్ ప్రతి ఒక్కరినీ థియేటర్స్ కి ఆకర్షిస్తోన్న బాహుబలి అన్ని ఏరియాల్లోనూ రికార్డ్స్ ని క్రియేట్ చేసింది.

మేము ఇది వరకూ చెప్పినట్టే సీడెడ్ లో కూడా ఓ ల్యాండ్ మార్క్ ఫిగర్ ని టచ్ చేసింది. మొదటి 10 రోజుల్లో సీడెడ్ లో 15 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసిన బాహుబలి 4వ వీకెండ్ లో అనగా మొదటి 24 రోజుల్లో ఈ సినిమా 20 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసి న్యూ బెంచ్ మార్క్ ని క్రియేట్ చేసింది. ఇదొక సరికొత్త రికార్డ్ అని చెప్పవచ్చు. అంతే కాకుండా అటు తెలుగు రాష్ట్రాల్లో మరియు హిందీ వెర్షన్ లో ఈ సినిమా 100 కోట్ల మార్క్ ని క్రాస్ చేసి రికార్డ్ సృష్టించింది. విడుదలైన నాలుగు వారాలైనా ఈ సినిమాకి ఇంకా క్రేజ్ తగ్గకపోవడమే ఈ రేంజ్ కలెక్షన్స్ ని తెచ్చిపెడుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు