రామోజీ ఫిల్మ్ సిటీలో ‘బాహుబలి’ షూటింగ్.

రామోజీ ఫిల్మ్ సిటీలో ‘బాహుబలి’ షూటింగ్.

Published on Sep 23, 2014 4:40 PM IST

bahubali-first-look
దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చారిత్రాత్మక చిత్రం ‘బాహుబలి’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ మరియు ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు.

ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తామని దర్శకనిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. మొదటి భాగం షూటింగ్ చివరిదశకు చేరుకుందని సమాచారం. ఇటివలే డబ్బింగ్ కార్యక్రమాలను ప్రారంభించారు. ‘బాహుబలి’ పార్ట్ 1ను ఏప్రిల్ 17, 2015న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్రానికి యం.యం.కీరవాణి స్వరాలను అందిస్తున్నారు. దాదాపు 180 కోట్ల భారి బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పలు భాషలలో డబ్బింగ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు