రాజమౌళి ఊహకు సలాం..

రాజమౌళి ఊహకు సలాం..

Published on Dec 22, 2014 3:22 PM IST

baahubali-rajamouli
కమర్షియల్ సినిమాలకు కొత్త అర్ధం చెప్పిన మాస్ దర్శకుడు. మగదీరుడిని చూసి భారతీయ సినిమా ప్రేక్షకుల చేత జేజేలు కొట్టించిన దర్శకధీరుడు. ‘ఈగ’ చేత విన్యాశాలు చేయించి తెలుగు సినిమా సత్తాను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ వరకూ చాటిన తెలుగోడు, మనవాడు ‘రాజమౌళి’. ఈ దర్శకుడు ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న తాజా సినిమా ‘బాహుబలి’. నేడు ఈ సినిమా మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా రాజమౌళికి సలాం చేయాల్సిందే.

ఒకప్పటి రాచరిక సంస్కృతిని, అలనాటి రాజుల వైభోగాలను, చారిత్రాత్మక కోటలను ఆవిష్కరించడానికి కళా దర్శకులు, ప్రీ ప్రొడక్షన్ యూనిట్ సభ్యులు, కాస్ట్యూమ్ డిజైనర్లు ఎంతో కష్టపడ్డారు. వారి ప్రతిభ ప్రపంచానికి తెలిసేలా రాజమౌళి నేడు మేకింగ్ వీడియో విడుదల చేశారు. ప్రతి ఒక్కరిని గౌరవించారు.

మన దర్శకుల ఊహలు, తెలుగు సినిమా నిర్మాణ విలువలు, ఇక్కడి టెక్నీషియన్ల ప్రతిభ అంతర్జాతీయ సినిమాలను సవాల్ చేసే స్థాయిలో ఉంటాయని ఎవరూ కలలో కూడా ఊహించే ప్రయత్నం చేసి ఉండరు. రాజమౌళి మదిలో ఆ ఊహా పురుడు పోసుకుంది. రాజమౌళి ఊహకు ఊపిరి పోయడానికి యూనిట్ సభ్యులందరూ నిరంతరం శ్రమిస్తున్నారు. రెండేళ్ళ ‘బాహుబలి’ చిత్ర బృందం శ్రమను మూడు నిముషాల వీడియోలో కళ్ళకు కట్టినట్టు చూపించారు.

‘బాహుబలి’ సినిమా నిర్మాణాన్ని ఒక బాధ్యతాలా కాకుండా ఒక యజ్ఞంలా చేస్తున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలో ఇదొక ఆణిముత్యంలా నిలుస్తుందని ఘంటాపథంగా చెప్పవచ్చు.

‘బాహుబలి’ మేకింగ్ వీడియో చూడడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు