‘బాహుబలి’తో ప్రేమలో పడ్డాను – తమన్నా

‘బాహుబలి’తో ప్రేమలో పడ్డాను – తమన్నా

Published on Sep 1, 2014 2:09 PM IST

Thamanna
ప్రభాస్, అనుష్క, తమన్నా నటినటులుగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చారిత్రాత్మక సినిమా ‘బాహుబలి’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం మహాబలేశ్వరంలో జరుగుతుంది. ఈ షెడ్యూల్ సెప్టెంబర్ రెండవ వారం వరకు కొనసాగుతుంది.

‘షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతి సన్నివేశంతో నేను ప్రేమలో పడ్డాను. ‘ అంటూ తమన్నా ట్విట్టర్లో పేర్కొంది.

రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన షెడ్యూల్లో ప్రభాస్, తమన్నాలపై రొమాంటిక్ గీతాన్ని, కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. రానా, సత్యరాజ్, రమ్యకృష్ణ తదితరలు కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మిస్తున్నారు. యం.యం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ మొదటి పార్ట్ 2015 ప్రధమార్ధంలో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు