డిసెంబర్ లో పూర్తి కానున్న ‘బాహుబలి’ షూటింగ్..!

డిసెంబర్ లో పూర్తి కానున్న ‘బాహుబలి’ షూటింగ్..!

Published on Oct 2, 2014 3:00 AM IST

Baahubali_poster
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారి బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ‘బాహుబలి’. వచ్చే ఏడాది వేసవిలో, ఏప్రిల్ నెలలో మొదటి పార్ట్ విడుదల కానుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఈ సినిమా షూటింగ్ నిరాటంకంగా సాగుతుంది.

‘బాహుబలి’ సినిమా మొదటి పార్ట్ షూటింగ్ ఈ ఏడాది ముగింపు పలికేలోగా.. డిసెంబర్ నెలలో పూర్తవుతుంది. ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ప్రారంభమయ్యాయి. సినిమాలో గ్రాఫిక్స్ వర్క్స్ కి చాలా ప్రాముఖ్యత ఉంది. వాటికి ఎక్కువ సమయం కేటాయించడం కోసం ముందుగా షూటింగ్ పూర్తి చేస్తున్నారు. సినిమా విడుదలలో ఎటువంటి జాప్యం జరగకూడదని తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అనుష్క, తమన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. రానా, నాజర్, సత్యరాజ్, రమ్య కృష్ణ, అడవి శేష్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి యం.యం.కీరవాణి స్వరాలను అందిస్తున్నారు. ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మిస్తున్నారు. తమిళంలో ‘మహాబలి’ పేరుతో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు