సాంగ్ షూట్ లో బిజీగా ఉన్న ‘బాహుబలి’ టీం

సాంగ్ షూట్ లో బిజీగా ఉన్న ‘బాహుబలి’ టీం

Published on Jul 30, 2014 11:37 AM IST

bahubali-first-look

సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి – యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న అత్యంత భారీ బడ్జెట్ మూవీ ‘బాహుబలి’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా మొదటి పార్ట్ ని 2015 ఏప్రిల్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. అనుకున్న టైంకి సినిమాని ఫినిష్ చేసి అందించాలని ఈ చిత్ర టీం కంటిన్యూగా షూటింగ్ చేస్తోంది.

ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రభాస్ – తమన్నా మీద ఓ సాంగ్ ని షూట్ చేస్తున్నారు. అలాగే కొద్ది రోజుల ముందు నుంచి జరుగుతున్న ఈ షెడ్యూల్లో తమన్నా, అనుష్కలపై కూడా కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేసారు.

ఇండియాలోనే మొదటిసారిగా సుమారు 175 కోట్ల బడ్జెట్ తో ఆర్కా మీడియా వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రానా విఅలన్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు