రాజమౌళి ‘బాహుబలి’ ట్రైలర్ రిలీజ్ డేట్

రాజమౌళి ‘బాహుబలి’ ట్రైలర్ రిలీజ్ డేట్

Published on Apr 28, 2015 11:47 AM IST

Baahubali
టాలీవుడ్ తో పాటు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా పీరియాడికల్ ఫిల్మ్ ‘బాహుబలి’. టాలీవుడ్ సూపర్ సక్సెస్ఫుల్ క్రేజీ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘బాహుబలి’ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వారికి ఓ శుభవార్త. ఈ సినిమాని అనుకున్న టైంకి రిలీజ్ చేయక వాయిదా పడినా సినిమా కి సాంపిల్ గా చూపించే ట్రైలర్ ని రిలీజ్ చెయ్యడానికి రాజమౌళి టీం డేట్ ఫిక్స్ చేసింది.

‘ముందుగా ఈ సినిమాని మే 15న రిలీజ్ చేద్దాం అనుకున్నాం కానీ టెక్నికల్ గా ఆలస్యం అవడం వల్ల జూలైకి వాయిదా వేసాము. కానీ బాహుబలి ఫస్ట్ పార్ట్ అయిన బాహుబలి ది బిగినింగ్ ట్రైలర్ ని మాత్రం మే 31న రిలీజ్ చెయనున్నాం. అలాగే మే 1 నుంచి బాహుబలి సినిమాలని పాత్రలకి సంబందించిన పోస్టర్స్ ని వరుసగా రిలీజ్ చేస్తామని’ రాజమౌళి తెలిపాడు.

ప్రస్తుతం సింగపూర్, హాంకాగ్, చైనా లాంటి ప్రదేశాల్లో ఈ సినిమాకి సంబందించిన ప్విజువాల్ ఎఫెక్ట్స్ వర్క్ మరియు మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో సుధీప్, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆర్కా మీడియా వారు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాని ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు