‘బాహుబలి’ ముంబై ప్రీమియర్ షోలు రద్దు!


‘బాహుబలి – ది కంక్లూజన్’ చిత్రంపై తెలుగులో ఎంతటి క్రేజ్ ఉందో హిందీలో కూడా అంతే స్థాయి క్రేజ్ ఉంది. మొదటి పార్ట్ కూడా అనూహ్యంగా రూ.100 కోట్లు వసూలు చేయడంతో చిత్రంపై ఇంకాస్త ఎక్కువ దృష్టి పెట్టిన నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కరణ్ జోహార్ భారీ స్థాయి ప్రమోషన్లు చేపట్టి సినిమా హైప్ ను ఇంకాస్త పెంచారు. అంతేగాక సినిమా ఈరోజు సాయంత్రం ముఖ్యమైన సెలబ్రిటీలందరికీ స్పెషల్ ప్రీమియర్ షోలను కూడా ఏర్పాటు చేశారు.

కానీ అనుకోకుండా బాలీవుడ్ సీనియర్ నటుడు వినోద్ ఖన్నా మరణించడంతో ఆయన మృతికి సంతాపంగా ఈరోజు ప్రదర్శించవలసిన ప్రీమియర్ షోలను రద్దు చేశారు. ఈ విషయాన్ని కరణ్ జోహార్ స్వయంగా తెలిపారు. ఇకపోతే రేపటి నుండి ప్రదర్శితం కావలసిన షోలు యాథావిధిగా జరుగుతాయి.

 

Like us on Facebook