‘బాహుబలి 2’ వీఆర్ ఎక్స్‌పీరియన్స్ అదిరిపోతుందట..!

‘బాహుబలి 2’ వీఆర్ ఎక్స్‌పీరియన్స్ అదిరిపోతుందట..!

Published on Oct 16, 2016 8:00 PM IST

baahubali-2

ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన ‘బాహుబలి’కి రెండో భాగమైన ‘బాహుబలి 2’ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి మొదటి భాగానికి ఎన్నో రెట్లు మించేలా రెండో భాగం ఉండేలా సినిమా కోసం కష్టపడుతూ వస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఇండియన్ సినిమా చరిత్రలోనే ప్రమోషన్స్ విషయంలో ఎవ్వరూ చేయని ప్రమోషన్స్ బాహుబలి 2కి చేయనున్నారు. ఈ క్రమంలోనే వర్చువల్ రియాలిటీలో మేకింగ్ వీడియోను విడుదల చేయనున్నట్లు రాజమౌళి కొద్దిరోజుల క్రితమే ప్రకటించారు. మరోవారం రోజుల్లో ఈ వీడియో విడుదల కానుంది.

బాహుబలి కోసం రాజమౌళి టీమ్ నిర్మించిన మాహిష్మతి సామ్రాజ్యాన్ని వర్చువల్ రియాలిటీలో ప్రదర్శించేందుకు ప్రత్యేక కెమెరాలను వాడి ఇప్పటికే మేకింగ్ వీడియోను చిత్రీకరించారు. అక్టోబర్ 22న మొదటి వర్చువల్ రియాలిటీ వీడియో విడుదల కానుంది. వర్చువల్ రియాలిటీ అన్న టెక్నాలజీతో బాహుబలి సెట్స్‌లో ఉన్నట్లుగా ఫీలవుతూ విజువల్స్ చూసే అవకాశం ఉంటుంది. కేవలం ఈ వర్చువల్ రియాలిటీ ప్రమోషన్స్ కోసమే రాజమౌళి టీం 25 కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. ఇక ఇందుకోసం అవసరమైన ఎక్విప్‌మెంట్ గురించి కూడా బాహుబలి టీమ్ అవగాహన కల్పిస్తోంది. ఈ వర్చువల్ రియాలిటీ వీడియో అభిమానులకు అదిరిపోయే సరికొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని టీమ్ చెబుతూ వస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు