‘బాహుబలి’ ప్రీక్వెల్ సిద్ధమవుతోంది !

‘బాహుబలి’ ప్రీక్వెల్ సిద్ధమవుతోంది !

Published on Jan 16, 2017 7:00 PM IST

bahubali
జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి అద్భుత సృష్టి ‘బాహుబలి’ చిత్రానికి ప్రీక్వెల్ రాబోతోంది. అయితే అది సినిమా రూపంలో కాదు పుస్తకాల రూపంలో. ఈ పుస్తకాల్ని కొచ్చికి చెందిన రచయిత ఆనంద్ నీలకంఠన్ రాస్తున్నారు. రాజమౌళి బాహబలి – ది బిగినింగ్, బాహుబలి – ది కన్ క్లూజన్ అనే పేర్లతో సినిమాలు తీస్తే నీలకంఠన్ మాత్రం వాటి ముందు కథ అనే అర్థం వచ్చేట్టు బాహుబలి – బిఫోర్ ది బిగినింగ్ పేరును తన పుస్తకాల సిరీస్ కు పెట్టాడు.

ఈ సిరీస్ లో భాగంగా మొదటి పుస్తకం ‘ది రైజ్ ఆఫ్ శివగామి’ ని సిద్ధం చేసి కవర్ ను ఈ నెల 20న రిలీజ్ చేయనున్నారు. అలాగే మిగిలిన రెండు పుస్తకాలు బాహుబలిలో బాగా హైలెట్ అయిన కట్టప్ప పాత్రకు సంబంధించినవిగా ఉండనున్నాయి. ముందుగా ఇంగ్లీషులో ఈ పుస్తకాల్ని రిలీజ్ చేసి తరువాత తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ పుస్తకాల రిలీజ్ ను ఏప్రిల్ 29 బాహుబలి – ది కన్ క్లూజన్ చిత్రం విడుదల తరువాత చేయనున్నారు. ఈ చిత్రం పై ఇది వరకే పలు కథల పుస్తకాలు, కామిక్ పుస్తకాలు, కంప్యూటర్ సంబంధిత గేమ్స్, ఆట వస్తువులు రూపొందిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు