‘బాహుబలి’ స్క్రీన్ ప్లే చాలా ఇంటెన్స్ గా ఉంటుంది – అనుష్క

‘బాహుబలి’ స్క్రీన్ ప్లే చాలా ఇంటెన్స్ గా ఉంటుంది – అనుష్క

Published on Nov 23, 2014 8:36 PM IST

anushka
లేడీ ఓరియెంటెడ్ పాత్రలతో తన కంటూ ఓ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న హీరోయిన్ యోగ బ్యూటీ అనుష్క. అటు నటనా ప్రాధాన్యం, ఇటు గ్లామర్ ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూ సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్ గా వెలుగొందుతున్న అనుష్క ప్రస్తుతం రెండు తెలుగు, రెండు తమిళ భాషలకు చెందిన మోస్ట్ ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. తెలుగులోకి వస్తే బాహుబలి, రుద్రమదేవి సినిమాలు చేస్తోంది.

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనుష్క బాహుబలి మూవీ గురించి మాట్లాడుతూ ‘రాజమౌళి కథ చెప్పే విధానం, పాత్రలని చూపించే విధానం, తన పాత్రకి కావాల్సిన ప్రతి విషయంపై తను ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటాడు. అలాగే ఎవరి నుంచి పెర్ఫార్మన్స్ ఎలా రాబట్టుకోవాలో తనకి బాగా తెలుసు. నేను సినిమాలు చూస్తూ పెరగలేదు కానీ ఈ సినిమా విషయంలో అమేజింగ్ టెక్నీషియన్స్, మేకప్ ఆర్టిస్ట్స్, గ్రాఫికల్ డిజైనింగ్ టీంతో కలిసి పనిచేసే ఛాన్స్ వచ్చింది. బాహుబలి చాలా గ్రాండ్ గా ఉండడమే కాకుండా చాలా ఇంటెన్స్ స్క్రీన్ ప్లే కూడా ఉంటుందని’ తెలిపింది.

అనుష్కతో పాటు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా, తమన్నా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. రాజమౌళి గత రెండేళ్ళుగా చిత్రీకరిస్తున్న ఈ సినిమా మొదటి పార్ట్ ని 2015 ఏప్రిల్ 17న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు