ఫోటో మూమెంట్ : హమ్మయ్య.. పాట షూటింగ్ పూర్తైంది!

ఫోటో మూమెంట్ : హమ్మయ్య.. పాట షూటింగ్ పూర్తైంది!

Published on Mar 5, 2015 6:15 PM IST

Bahubali
దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చారిత్రక చిత్రం.. ‘బాహుబలి’. ఈ సినిమా విడుదల మే 15వ తేదీగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ట్విట్టర్ ద్వారా రాజమౌళి ఈ విషయాన్ని తెలియపరిచిన విషయాన్ని నిన్నే తెలియజేశాం. ఒక్క పాట షూటింగ్ మినహా సినిమా షూటింగ్ పూర్తైన విషయాన్ని రాజమౌళి ఆ సందేశంలో చెప్పారు. అంతకుముందు పాట పూర్తైన సందర్భంగా సినిమా యూనిట్ రిలాక్స్ అవుతూ ఒక గ్రూప్ ఫోటో దిగారు. ఇప్పుడా ఫోటో సోషల్ మీడియాలో ఆసక్తి రేపుతోంది. ‘హమ్మయ్య.. ఇంకొక్క పాట పూర్తైతే సినిమా అయిపోయినట్టే!’ అన్నట్టు లేదూ ? వాళ్ళిచ్చిన పోజు!

మిగిలిన ఆ ఒక్క పాటను కూడా వీలైనంత త్వరలో పూర్తి చేసే సన్నాహాల్లో చిత్ర యూనిట్ ఉంది. ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుష్క, తమన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రానా ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు. ఎం. ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా, ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు