పాట చిత్రీకరణలో ‘బాహుబలి’.

పాట చిత్రీకరణలో ‘బాహుబలి’.

Published on Sep 13, 2014 12:45 PM IST

Bahubali
కొరియోగ్రాఫర్ శంకర్ మాస్టర్ నేతృత్వంలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో ప్రభాస్ పై పాటను చిత్రీకరిస్తున్నారు దర్శకుడు రాజమౌళి. ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా ప్రధాన పాత్రలలో రూపొందుతున్న ‘బాహుబలి’ సినిమా తాజా షెడ్యూల్ సెప్టెంబర్ 12, శుక్రవారం నుండి హైదరబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం అయ్యింది. మరో 10 రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగుతుంది.

ఇటివల మహాబలేశ్వరంలో జరిగిన షెడ్యూల్ లో ప్రభాస్, తమన్నాలపై కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. వర్షం యూనిట్ సభ్యులను కొంత ఇబ్బంది పెట్టినా సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ పొగమంచులో అద్బుతమైన సన్నివేశాలు చిత్రీకరించారని రాజమౌళి ప్రసంశలు కురిపించారు.

సత్యరాజ్, రమ్యకృష్ణ తదితరలు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ భారి బడ్జెట్ సినిమాను కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మిస్తున్నారు. యం.యం.కీరవాణి సంగీత దర్శకుడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు