ఫుల్ స్పీడ్‌లో ‘డిక్టేటర్’ ప్రీ ప్రొడక్షన్!

ఫుల్ స్పీడ్‌లో ‘డిక్టేటర్’ ప్రీ ప్రొడక్షన్!

Published on May 27, 2015 8:00 PM IST

balakrishna
వరుస సినిమాలతో కుర్రహీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తున్న నందమూరి నటసింహం బాలకృష్ణ, తన 99వ సినిమా కోసం సిద్ధమైన విషయం తెలిసిందే. బాలయ్య 99వ సినిమా కావడంతో మొదట్నుంచీ ఈ సినిమాపై భారీ క్రేజ్ ఉంది. బాలీవుడ్‌లో పేరొందిన పెద్ద నిర్మాణ సంస్థ ఎరోస్ ఇంటర్నేషనల్ ఈ సినిమాను తెరకెక్కించనుంది. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు శ్రీవాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనుండడంతో పాటు సహ నిర్మాతగానూ వ్యవహరించనున్నారు.

మే 29న ఈ సినిమా ముహూర్తం కార్యక్రమాలు జరగనున్నాయి. ‘డిక్టేటర్’ అనే పవర్ఫుల్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా జూన్ 12నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. షూటింగ్‌కు మరికొన్ని రోజులే ఉండడంతో సినిమా యూనిట్ శరవేగంగా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తెలుగు ఇండస్ట్రీలోని స్టార్ రైటర్లైన కోన వెంకట్, గోపీ మోహన్, బీవీఎస్ రవి, శ్రీధర్ శ్రీపాన, డైమండ్ రత్నంలు కలిసి ఈ సినిమా కోసం పనిచేయడం విశేషంగా కనిపిస్తోంది. స్క్రిప్ట్‌లో తుదిమెరుగులు దిద్దడంతో పాటు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వారికి రీడింగ్ సెషన్స్ కూడా నిర్వహిస్తున్నారు.

ఇదే విషయాన్ని రచయిత కోనవెంకట్ తెలియజేశారు. యువ సంగీత దర్శకుడు, అతి కొద్దికాలంలోనే చాలామంది పెద్ద హీరోలతో పనిచేసిన థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూరుస్తున్నారు. బాలయ్య, థమన్‌ల కాంబినేషన్‌లో రూపొందే మొదటి సినిమా డిక్టేటరే! ఈ సినిమాలో ఓ హీరోయిన్‌గా అంజలి నటించనుండగా, మరో హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు