బాల్డ్ హెడ్ హీరో వంద బాదాడు…!

బాల్డ్ హెడ్ హీరో వంద బాదాడు…!

Published on Nov 15, 2019 10:00 PM IST

బాలీవుడ్ యంగ్ టాలెంట్ హీరో ఆయుష్మాన్ ఖురానా హీరోగా తెరకెక్కిన చిత్రం బాలా. యుక్త వయసులో జుట్టు కోల్పోయి బట్ట తల వస్తే ఉద్యోగం, పెళ్లి మరియు సమాజంలో గౌరవం వంటి విషయాలలో వచ్చే సమస్యలు, మానసిక వేదన వంటి విషయాలతో కామిక్ గా తెరకెక్కించారు. విడుదలైన మొదటి రోజునుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం వసూళ్ల పరంగా కూడా దుమ్మురేపుతోంది. గత వారం విడుదలైన బాలా చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 100కోట్ల వసూళ్లకు చేరుకుంది.

ఇండియాలోనే 72.24 కోట్ల వసూళ్లు రాబట్టగా ఓవర్ సీస్ కలెక్షన్స్ తో కలుపుకొని ఇప్పటివరకు దాదాపు 100.44 కోట్లు సాధించింది. ఆయుష్మాన్ ఖురానా నటించిన గత చిత్రాలు డ్రీమ్ గర్ల్, ఆర్టికల్ 15 కూడా వంద కోట్ల వసూళ్ల మార్కును చేరుకున్నాయి. ఇక ఆయుష్ తన తదుపరి చిత్రంగా శుభ మంగళ్ జ్యాదా సావధాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు