బాలయ్య వందో సినిమా టైటిల్ ఇదేనా?

బాలయ్య వందో సినిమా టైటిల్ ఇదేనా?

Published on Apr 19, 2015 12:13 AM IST

balkrishna-lion
ఈ మధ్య కాలంలో వరుస హిట్లతో కుర్రహీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. ‘లెజెండ్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బాలయ్య నటిస్తోన్న తాజా చిత్రం ‘లయన్’ మే 1న విడుదలవనున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య 99వ చిత్రమొకటి సెట్స్‌పైకి వెళ్ళనుంది. బాలీవుడ్‌లో పేరొందిన పెద్ద నిర్మాణ సంస్థ ఎరోస్ ఇంటర్నేషనల్ ఈ సినిమాను తెరకెక్కించనుంది. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు శ్రీవాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.

ఇదిలా ఉంటే బాలయ్య నటించే వందో సినిమాకు కూడా ఇప్పట్నుంచే సన్నాహాలు మొదలైనట్లు తెలుస్తోంది. బాలయ్యకు సింహ, లెజెండ్ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలను అందించిన బోయపాటి శ్రీను ఈ వందో సినిమాను తెరకెక్కిస్తారని సమాచారం. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోయే ఈ సినిమాకు బాలయ్య ఎనర్జీకి, స్టార్‌డమ్‌కి సరిగ్గా సరిపోయే టైటిల్ పరిశీలనలో ఉందట. చరిత్రకు ఒక్కడు అనే పవర్‌ఫుల్ టైటిల్ అయితే బాలయ్య ఇమేజ్‌ను మరింత పెంచేదిగా ఉంటుందని పరిశీలిస్తున్నారట. ఈ సినిమా తెరకెక్కి, థియేటర్లలోకి రావడానికి ఇంకా ఎంత సమయం పడుతుందో తెలియదు కానీ అభిమానులు మాత్రం వందో సినిమా మైలురాయి కోసం ఇప్పట్నుంచే ఊహాగానాలు మొదలుపెట్టారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు