బర్త్ డే కానుకగా బాలయ్య 100వ మూవీ

బర్త్ డే కానుకగా బాలయ్య 100వ మూవీ

Published on Nov 24, 2015 11:35 AM IST

balakrishna
అతి త్వరలో నందమూరి బాలకృష్ణ తన కెరీర్లో 100 సినిమాలు అనే ఓ అరుదైన మైలురాయిని చేరుకోనున్నాడు. బాలయ్య ప్రస్తుతం శ్రీవాస్ డైరెక్షన్ లో చేస్తున్న 99వ సినిమా ‘డిక్టేటర్’ షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ ని డిసెంబర్ మిడిల్ కల్లా ఫినిష్ చేసి సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. సినిమాకంటే ముందు డిసెంబర్ 20న కనీవినీ ఎరుగని రీతిలో ఆంధ్రప్రదేశ్ అమరావతిలో డిక్టేటర్ ఆడియో లాంచ్ చేయనున్నారు. ఈ సినిమా కంటే మించి బాలయ్య 100వ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మాకు అందిన తాజా సమాచారం ప్రకారం నందమూరి బాలకృష్ణ 100వ సినిమా ఆయన బర్త్ డే కానుకగా 2016 జూన్ 10వ తేదీన లాంచ్ చేయనున్నారు. బాలయ్యతో ‘సింహా’, ‘లెజెండ్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన బోయపాటి శ్రీను ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తాడని సమాచారం. బోయపాటి శ్రీను ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమాని ఏప్రిల్ కల్లా రిలీజ్ చేసేసి ఆ తర్వాత బాలయ్య 100వ సినిమాపై బోయపాటి దృష్టి పెడతాడని సమాచారం. బాలయ్య కూడా బోయపాటి శ్రీను అయితేనే తన అభిమానులు 100% సంతృప్తి చెందేలా 100వ సినిమాని తీయగలడని పూర్తిగా విశ్వసిస్తున్నట్లు సమాచారం. వీరి కాంబినేషన్ లో వచ్చిన లెజెండ్ సినిమా కూడా బాలయ్య పుట్టిన రోజునే లాంచ్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ అదే సెంటిమెంట్ ని రిపీట్ చేయబోతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు