అర్జెంట్ గా ‘బాలయ్య’కి హీరోయిన్ కావాలట !

అర్జెంట్ గా ‘బాలయ్య’కి హీరోయిన్ కావాలట !

Published on Feb 19, 2020 6:51 PM IST

నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న సినిమా గురించి ఇప్పటికే అనేక రకాలుగా అనేక రూమర్స్ సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. అందులో ప్రధానంగా వినిపిస్తోన్న న్యూస్ మాత్రం బాలయ్య సినిమాలో హీరోయిన్ గురించే. ఈ సినిమాలో బాలీవుడ్ బబ్లీ బ్యూటీ సోనాక్షి సిన్హాని దగ్గర నుంచీ కేథరీన్ థెరీసా దాకా ఈ సినిమాలో ఆమె హీరోయిన్, కాదు ఈమె అంటూ పలు రకాలుగా వార్తలు వచ్చాయి.

కానీ చిన్న హీరోల సినిమాల్లో సెకెండ్ లీడ్ క్యారెక్టర్లు చేసే కేథరీన్ లాంటి హీరోయిన్ కూడా.. బాలయ్య లాంటి సీనియర్ స్టార్ హీరో పక్కన నటించడానికి ఆసక్తి చూపించట్లేదు. దీనికి తోడు సినిమా కూడా వచ్చే వారం నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. సో… అర్జెంట్ గా బాలయ్యకు ఒక హీరోయిన్ కావాలి. అన్నట్టు ఈ సినిమాకి మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇక ఇంతకుముందు బాలయ్య – బోయపాటి కలయికలో వచ్చిన ‘సింహ, లెజెండ్’ చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. అలాగే ఈ సినిమా కూడా హిట్ అయితే, వీళ్ళు హ్యాట్రిక్ హిట్ కొట్టినట్లే. మరి ప్లాప్ ల్లో ఉన్న ఈ హిట్ కాంబినేషన్ హిట్ కొడతారా.. అయితే సినిమాలో బాలయ్య అఘోరగా కనిపించబోతున్నాడట.. దాని కోసం ఆయన తాజాగా కనిపిస్తోన్న గుండు లుక్ అని తెలుస్తోంది. ఏమైనా ఈ సినిమా పై మాత్రం మంచి అంచనాలే ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు