సిబిఐ ఆఫీసర్‌గా ఫైట్ చేస్తున్న బాలకృష్ణ..

సిబిఐ ఆఫీసర్‌గా ఫైట్ చేస్తున్న బాలకృష్ణ..

Published on Dec 21, 2014 5:37 PM IST

balakrishna

సత్యదేవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 98వ సినిమా కోసం బాలకృష్ణ గత కొన్ని రోజులుగా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇటీవల ఈ సినిమా లుక్ ను విడుదల చేయగా ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. ఈ సినిమాలో బాలకృష్ణ సిబిఐ ఆఫీసర్ గా, సామాన్యుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు.

ప్రస్తుతం బాలయ్య సిబిఐ ఆఫీసర్‌గా నటిస్తున్న పాత్రకు సంబంధించి యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్లుగా నటిస్తున్నారు. రుద్రపాటి రమణారావు నిర్మాత.

ఎన్నికల తర్వాత బాలయ్య నటిస్తున్న తొలి సినిమా ఇదే. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘లయన్’, ‘గాడ్సే’ మరియు ‘వారియర్’ టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు