ఆర్జీవీపై నమ్మకముంచిన బాలకృష్ణ !
Published on Jul 4, 2017 2:38 pm IST


నందమూరి బాలకృష్ణ గతంలో ఒకసారి తన తండ్రి స్వర్గీయ నందమూరి తారకరామారావుగారి జీవితంపై సినిమా రూపొందిస్తానని, అందులో తానే ఎన్టీఆర్ పాత్ర పోషిస్తానని టీడీపీకి సంబందించిన ఒక పార్టీ మీటింగ్లో బహిరంగంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మాట ప్రకారమే ఆయన స్క్రిప్ట్ వర్క్ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి కథను కూడా సిద్ధం చేస్తున్నారు.

ఇక ఈ సినిమాకు డైరెక్టర్ గా ఆర్జీవీని ఎంచుకున్నారట బాలయ్య. ఏ విధంగా చూసినా ఇది బెటర్ ఛాయిస్ అని చెప్పొచ్చు. జీవిత చరిత్రలు, వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాలను రూపొందించడంలో ఆర్జీవీని మించిన దర్శకుడు లేడు. అందుకు ఆయన రూపొందించిన ‘రక్త చరిత్ర, వంగవీటి, 26/11’ వంటి సినిమాలే నిదర్శనాలు. మరి వర్మ తన నిశితమైన పరిశోధన ద్వారా ఈ బయోపిక్లో ఎలాంటి కొత్త విషయాలు చెబుతారో చూడాలి.

 
Like us on Facebook