‘లెజెండ్’ను మించిన హిట్ కావాలంటున్న ఫ్యాన్స్

‘లెజెండ్’ను మించిన హిట్ కావాలంటున్న ఫ్యాన్స్

Published on Dec 6, 2019 9:31 PM IST

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కొత్త చిత్రం ఈరోజే లాంఛ్ అయింది. ఈ ప్రాజెక్ట్ కోసం ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న అభిమానులు కాస్త ఆలస్యమైనా సినిమా మొదలవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు సినిమా మీద అంచనాలు కూడా భారీగానే పెట్టుకున్నారు. ‘లెజెండ్’ తర్వాత బాలయ్య చాలా సినిమాలు చేసినా ఆ స్థాయి హిట్ అందుకోలేదు.

అందుకే వీరి కాంబినేషన్లో రాబోయే సినిమా ఖచ్చితంగా హిట్టవ్వాలని కోరుకుంటున్నారు. మొదట ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించారు. కాబట్టి ఈసారి ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలని ఆశిస్తున్నారు.
వచ్చే యేడాది వేసవికి సినిమా విడుదల ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు