బాలకృష్ణ కోసం అభిమానులు పడుతున్న తపన చూస్తే ఆశ్చర్యం కలగాల్సిందే !

Gautamiputra-Satakarni

బాలకృష్ణ అంటే నందమూరి అభిమానుల్లో ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఇప్పటికే పలు సార్లు అదే విషయాన్ని రుజువు చేశారు అయన అభిమానులు. ప్రసుతం క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ నటిసున్న 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. దీంతో అభిమానులంతా ఈ సినిమా మంచి విజయం సాధించాలని బలంగా కోరుకుంటున్నారు. కొందరైతే ఊహకందని పనులు చేస్తున్నారు. తాజాగా ‘ఎన్ బి కె హెల్పింగ్ హాండ్స్’ అనే స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్న అనంతపురం జగన్ అనే అభిమాని ఈ సినిమా మంచి విజయం సాధించాలని, బాలయ్యకు ఆయన కుటుంబానికి, ఈ చిత్ర యూనిట్ కు మంచి జరగాలని 41 రోజుల భారతదేశ జైత్ర యాత్రను మొదలుపెట్టనున్నాడు.

ఇందులో దేశవ్యాప్తంగా శాతకర్ణి నిర్మించిన ప్రసిద్ది గాంచిన పుణ్యక్షేత్రాల్లో, 100 సర్వమత దేవాలయాల్లో కుంకుమార్చన, 23 శివాలయాల్లో రుద్రాభిషేకం, సర్వమత ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఈ యాత్ర పవిత్ర కార్తీక మాసంలో బాలయ్య చేతుల మీదుగా మొదలుకానుంది. బాలయ్య కోసం అభిమానులు ఇంతటి కఠినమైన దీక్షను పూనడం నిజంగా గొప్ప విషయమే. ఇకపోతే ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్ కు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే యూట్యూబ్ లో ఈ ఈజర్ మిలిన మార్క్ ను క్రాస్ చేసి దూసుకుపోతోంది.

 

Like us on Facebook