బాలయ్య.. తాతయ్య కానున్నారు!

బాలయ్య.. తాతయ్య కానున్నారు!

Published on Mar 6, 2015 4:38 PM IST

balakrishna
అవును.. నందమూరి బాలకృష్ణ తాతయ్య కాబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లా తునిలో తన మిత్రుడి కుమార్తె పెళ్ళి వేడుకకు హాజరైన సందర్భంగా ఆయన ఈ విషయాన్ని బయటపెట్టారు. త్వరలో తాను తాతయ్యను కానున్నాననీ, ఈ విషయం తనకు ఎంతో సంతోషాన్నిస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఆయన హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

ఇక గత సంవత్సరం ‘లెజెండ్’తో సూపర్ హిట్ అందుకున్న బాలయ్య.. తాజాగా ‘లయన్’ సినిమా ద్వారా మరో హిట్ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు