అభిమానుల కోసం యూఎస్ వెళ్లనున్న బాలయ్య !

అభిమానుల కోసం యూఎస్ వెళ్లనున్న బాలయ్య !

Published on Jan 16, 2017 9:22 PM IST

balakrishna
నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమిపుత్రశాతకర్ణి’ విడుదలై భారీ విజయం దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఆ విజయం యొక్క మోతాదును మరింత పెంచేందుకు శాతకర్ణి టీమ్ రిలీజ్ తరువాత కూడా ప్రమోషన్స్ భారీ స్థాయిలోనే చేస్తోంది. హీరో బాలకృష్ణతో సహా టీమ్ మొత్తం అన్ని చానెళ్లకు, పేపర్లకు, వెబ్ సైట్లకు వరుస ఇంటర్వూస్ ఇస్తూ హోరెత్తిస్తున్నారు. అందులో భాగంగానే బాలకృష్ణ ఓవర్సీస్ లో తనకు మొట్ట మొదటిసారి మిలియన్ మార్క్ ను అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలపాలనుకుంటున్నారు.

అందుకోసం ఆయన వచ్చే వారమే యూఎస్ వెళ్లి వీలైనన్ని థియేటర్లు పర్యటించి అభిమానులు, ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అవ్వనున్నారని సమాచారం. ఇప్పటికే యూఎస్ లో మిలియన్ మార్క్ దాటి 1.5 మిలియన్ దిశగా దూసుకుపోతున్న కలెక్షన్లు బాలయ్య టూర్ తర్వాత మరింత పెరిగి 2 మిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది. బాలయ్య కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ డైరెక్ట్ చేయగా శ్రియ శరన్, హేమామాలినీలు పలు ప్రధాన పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు