జనవరి 22న మొదలెట్టనున్న బాలయ్య ?

జనవరి 22న మొదలెట్టనున్న బాలయ్య ?

Published on Dec 15, 2019 9:29 PM IST

నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న సినిమా జనవరి 22న నుండి మొదలు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ను మెయిన్ విలన్ గా, సోనాక్షి సిన్హాని హీరోయిన్ గా తీసుకోవాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రంలో సెకెండ్ హీరోయిన్ కూడా ఉండబోతుందట. ఆ పాత్రకు కేథరీన్ థెరీసాని తీసుకోనున్నారట. అలాగే మరో అతిధి పాత్రలో హీరోయిన్ వేదిక కూడా కనిపించనుంది.

అలాగే హీరో శ్రీకాంత్ మరో నెగటివ్ రోల్ లో కనిపించబోతున్నాడు. శ్రీకాంత్ ఇంతకు ముందు నాగచైతన్య ‘యుద్ధం శరణం’లో విలన్ గా నటించాడు. కాగా ఈ సినిమా ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో సాగే పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్. ఇప్పటికే బోయపాటి బాలయ్య కలయికలో వచ్చిన ‘సింహ, లెజెండ్’ చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. అలాగే ఈ సినిమా కూడా హిట్ అయితే, వీళ్ళు హ్యాట్రిక్ హిట్ కొట్టినట్లే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు