బాలకృష్ణ 101వ సినిమా సంగతేంటో సాయంత్రం తేలిపోనుంది !

బాలకృష్ణ 101వ సినిమా సంగతేంటో సాయంత్రం తేలిపోనుంది !

Published on Feb 22, 2017 2:56 PM IST


తన 100వ చిత్రంగా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా చేసి, మంచి విజయం సాధించి అందరి మన్ననలు అందుకున్న నందమూరి బాలకృష్ణ ఇప్పటికీ తన 101వ సినిమా సంగతేమిటో ఖచ్చితంగా తేల్చలేదు. మొదట ఈ సినిమాని ‘రైతు’ పేరుతో కృష్ణ వంశీ డైరెక్ట్ చేస్తారనే వార్త బయటకు రాగా తాజాగా మిళ దర్శకుడు కెఎస్ రవికుమార్ తెరపైకొచ్చాడు. రవికుమార్ బాలకృష్ణ కోసం మంచి సబ్జెక్ట్ ఒకటి తయారు చేశారని, ఇందులో హీరోయిన్ గా తమన్నా నటిస్తుందని, దీనికి సంబందించిన చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు.

మరోవైపు బాలయ్య 101వ చిత్రాన్ని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేయనున్నాడని, ఈ ప్రాజెక్టుని భవ్య క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తుందని, ఈ మేరకు పూరి జగన్నాథ్ ఈరోజు సాయంత్రం 6 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి అధికారికంగా ప్రాజెక్టును ప్రకటిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీటిలో ఏది నిజమో తేలాలంటే ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు ఓపిగ్గా వేచి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు