త్వరలో 102 వ సినిమాను మొదలుపెట్టనున్న బాలయ్య !
Published on Jun 29, 2017 6:25 pm IST


100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ తో మర్చిపోలేని విజయాన్నందుకున్న నందమూరి బాలకృష్ణ ఆ తర్వాత 101, 102 సినిమాల్ని వెంట వెంటనే ప్రకటించేశారు. వాటిలో పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న 101వ చిత్రం ఇప్పటికే మొదలై చాలా వరకు షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఇక 102వ సినిమాని సీనియర్ దర్శకుడు కెఎస్. రవికుమార్ డైరెక్ట్ చేయనున్నారు.

కొంత కాలం క్రితమే ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ సినిమా యొక్క రెగ్యులర్ షూట్ ఆగష్టు రెండవ వారం నుండి కుంభకోణంలో మొదలుకానుందట. 40 రోజుల పాటు జరగబోయే ఈ షెడ్యూల్లో బాలకృష్ణ మొదటిరోజు నుండే పాల్గొంటారని తెలుస్తోంది. ఇకపోతే ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ నయనతార నటించనుంది. ఇకపోతే యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతున్న ఈ సినిమాకు టైటిల్ ఏంటి, ఇతర నటీనటులెవరు అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

 
Like us on Facebook