బాలయ్య ‘లయన్’ సెన్సార్ సర్టిఫికేట్ డీటైల్స్

బాలయ్య ‘లయన్’ సెన్సార్ సర్టిఫికేట్ డీటైల్స్

Published on May 4, 2015 5:42 PM IST

lion
నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన మరో పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లయన్’. సక్సెస్ఫుల్ ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాల తర్వాత బాలకృష్ణ మరోసారి ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా మే 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలను జరుపుకోనుందని ఇది వరకే తెలియజేశాం. లయన్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ వారు ఈ సినిమాకి ‘యు/ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు.

దీని ప్రకారం ఈ సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించే ఫ్యామిలీ డ్రామా కూడా ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకూ రిలీజ్ చేసిన రెండు ట్రైలర్స్ లో బాలకృష్ణ చెప్పిన మాస్ డైలాగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. బాలకృష్ణ మొదటిసారి ఓ పాత్రలో సిబిఐ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. బాలకృష్ణ సరసన త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్స్ గా కనిపించనున్నారు. మణిశర్మ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి రుద్రపాటి రమణారావు నిర్మాత. సత్యదేవా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు