త్వరలో ప్రారంభంకానున్న బాలకృష్ణ 99వ చిత్రం

త్వరలో ప్రారంభంకానున్న బాలకృష్ణ 99వ చిత్రం

Published on Mar 27, 2015 3:19 AM IST

balkrishna-lion
నందమూరి బాలకృష్ణ నటించిన ‘లయన్’ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలలో బిజీగా వుంది. మే 1నే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్ 10న ఆడియో విడుదల వేడుక జరగనుంది. త్రిష మరియు రాధికా ఆప్టే హీరోయిన్స్.

ఈ వ్యవధిలో బాలయ్యబాబు 99వ సినిమా ‘డిక్టేటర్’ కూడా మొదలుకానుంది. లక్ష్యం సినిమాతో పరిచయమైన శ్రీవాస్ ఈ చిత్రానికి దర్శకుడు. నయనతార హీరోయిన్ గా నటించనుంది. తమన్ సంగీతదర్శకుడు.ప్రముఖ రచయిత గోపీ మోహన్ ఈ ప్రాజెక్ట్ కోసం స్క్రిప్ట్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు