‘గౌతమిపుత్ర’ ట్రైలర్ రిలీజ్‌కు బాలయ్య కొత్త ప్లాన్!

‘గౌతమిపుత్ర’ ట్రైలర్ రిలీజ్‌కు బాలయ్య కొత్త ప్లాన్!

Published on Dec 11, 2016 5:49 PM IST

balakrishna
నందమూరి నటసింహం బాలయ్య హీరోగా నటిస్తోన్న వందో సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సంక్రాంతి కానుకగా జనవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోన్న విషయం తెలిసిందే. విలక్షణ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొని అంచనాలను పెంచేసింది. ఇక సినిమా విడుదలకు నెలరోజుల ముందే ప్రమోషన్స్ చేపట్టాలన్న ఆలోచనతో టీమ్ ఆడియో విడుదల వేడుకను డిసెంబర్ 16న తిరుపతిలో నిర్వహిస్తోంది.

అదేవిధంగా డిసెంబర్ 16న సాయంత్రం 5 గంటలకే సుమారు 100 థియేటర్లలో ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారట. కరీంనగర్‌లోని కోటి లింగాలలో బాలయ్య ప్రత్యేకంగా ఈ ట్రైలర్‌ను విడుదల చేస్తారట. అదేరోజు కోటేశ్వర సిద్ధేశ్వర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆడియో లాంచ్‌కు బయలుదేరుతారట. క్రిష్ స్వయంగా నిర్మించిన ఈ సినిమాలో శ్రియా హీరోయిన్‌గా నటించారు. శాతకర్ణి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో భారీ ఫైట్స్ అభిమానులకు పండగ వాతావరణం తెచ్చేలా ఉంటాయట!

సంబంధిత సమాచారం

తాజా వార్తలు