లుక్ టెస్ట్ కి రెడీ అవుతోన్న బాలయ్య !

లుక్ టెస్ట్ కి రెడీ అవుతోన్న బాలయ్య !

Published on Oct 20, 2019 9:18 AM IST

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 105వ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌పై కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో సి.కల్యాణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జైసింహా వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌ర్వాత ఈ హిట్ కాంబినేష‌న్‌ లో రూపొందుతోన్న ఈ చిత్రం కోసం బాలయ్య చాల హార్డ్ వర్క్ చేస్తున్నారట. సినిమా విషయంలో బాలకృష్ణ డెడికేషన్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రతి సినిమాలోనూ ఏదో ఒక వేరియేషన్ చూపించాలని తపిస్తుంటారాయన. ఆ తపన, డెడికేషన్ మూలంగానే బోయపాటితో చేయనున్న సినిమాలో బాడీ వేరియేషన్ చూపాలనుకుంటున్నారు. అందుకే ప్రతిరోజు గంటలబడి వర్కవుట్స్ చేస్తున్నారట. ప్రత్యేకంగా ఫిట్నెస్ నిపుణుడ్ని నియమించుకుని డైట్ కంట్రోల్ పాటిస్తున్నారు. సినిమా మొదలయ్యేనాటికి సుమారు 10 కిలోల వరకు తగ్గాలనేది టార్గెట్. సినిమాలో బాలయ్య లుక్ పూర్తిగా భిన్నంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు బోయపాటి.

అందుకోసం డిసెంబర్ నెలలో లుక్ టెస్ట్ చేయనున్నారు. వచ్చే ఏడాది జనవరి నెల నుండి సెట్స్ మీదికి వెళ్లనున్న ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనున్నారు. ఇది కూడా ‘సింహ, లెజెండ్’ తరహాలోనే హెవీ యాక్షన్ ఎంటెర్టైనర్ అని తెలుస్తోంది. ఇక కె.ఎస్‌.రవికుమార్‌ సినిమా విషయానికి వస్తే.. ఇటీవ‌ల విడుద‌లైన బాలయ్య యాక్షన్ లుక్‌ కి ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. మొత్తానికి బాలయ్య లుక్స్ అండ్ గెటప్స్ తోనే సినిమా పై అంచనాలు పెంచేశాడు. ఇక ఈ సినిమాలో సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌ గా నటిస్తున్నారు. ప్రకాశ్‌ రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిరంత‌న్ భ‌ట్‌ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సి.రామ్‌ ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు