తన పుట్టినరోజు ప్లాన్ మార్చిన బాలయ్య?

తన పుట్టినరోజు ప్లాన్ మార్చిన బాలయ్య?

Published on Jun 6, 2020 12:26 AM IST

గత కొన్ని రోజుల క్రితం వరకు నందమూరి నట సింహం బాలకృష్ణ టాపిక్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇదే సమయంలో బాలయ్య పుట్టినరోజు కూడా దగ్గరకు వచ్చేస్తుంది. ఈ జూన్ 10 బాలయ్య పుట్టిన రోజు కావడంతో ఆ స్పెషల్ రోజున బాలయ్యతో పాడించిన ఒక పాటను ప్లాన్ చేశారన్న సంగతి అందరికీ తెలిసిందే.

అయితే మాములుగా మన స్టార్ హీరోల పుట్టినరోజు వస్తుంది అంటే అభిమానులు ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం ఖచ్చితంగా ఎదురు చూస్తుంటారు. అలాగే ఈ సారి కూడా బాలయ్య,బోయపాటి శ్రీనుల నుంచి రాబోతున్న ఈ కొత్త సినిమా ఫస్ట్ లుక్ కూడా చూద్దామని ఉవ్విళూరుతున్నారు.

అయితే ఈ బర్త్ డే రోజున మాత్రం బాలయ్య ప్లాన్ మార్చినట్టు తెలుస్తుంది. దానికి బలమైన కారణమే ఉందట. ఈ చిత్రం కేవలం కొద్ది రోజులు మాత్రమే షూటింగ్ పూర్తి చేసుకున్నందున అప్పుడే ఫస్ట్ లుక్ పోస్టర్ ను రివీల్ చేసెయ్యడం సరికాదని అందుకే ఆపమన్నట్టుగా బాలయ్య సూచించినట్టు తెలుస్తుంది. మరి బాలయ్య మరోసారి పాడిన ఎలా ఉండనుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు