వైజాగ్ లో సందడి చేసిన బాలయ్య

వైజాగ్ లో సందడి చేసిన బాలయ్య

Published on Jan 26, 2015 11:32 PM IST

balakrishna1
నిన్న రాత్రి వైజాగ్ లో జరిగిన ‘విశాఖ ఉత్సవ్’ కార్యక్రమంలో భాగంగా నందమూరి బాలకృష్ణ తన అభిమానులను ఉర్రూతలూగించారు. ఈ వేడుకలో మాట్లాడుతూ మన రాష్ట్ర పురోగతిని, బాధ్యతను నిలబెట్టడం ఇక్కడున్న ప్రతీఒక్కరి భాద్యత అని తెలిపారు. ఆంద్రరాష్ట్రాన్ని దేశానికి తలమానికంగా మార్చాలని, హూద్ హూద్ తుఫానును ఎదుర్కుని నిలబడ్డ నగరమని గుర్తుచేశారు.

ఈ కార్యక్రమాన్ని ఆహ్లాదకరంగా మార్చడానికి తన ‘లెజెండ్’ సినిమాలో పలు పంచ్ డైలాగులు సైతం వేశారు. దీనికి ముందు వుడా వారు ఏర్పాటు చేసిన ఫ్లవర్స్ ఎక్స్పో ఈవెంట్ ని సందర్శించారు. ప్రస్తుతం బాలయ్య తన ‘లయన్’ షూటింగ్ పనులలో బిజీగా వున్నాడు. ఈ సినిమా టీజర్, పోస్టర్ లు ఇప్పటికే ప్రేక్షకులకు చేరువయ్యాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు