బాలయ్య సినిమాకి ఇంట్రస్టింగ్ టైటిల్ !

బాలయ్య సినిమాకి ఇంట్రస్టింగ్ టైటిల్ !

Published on Mar 7, 2021 9:55 PM IST

బోయపాటి శ్రీను – బాలయ్య బాబు కాంబినేషన్ అంటేనే పవర్ ఫుల్.. మరి వీరి కలయికలో వచ్చే సినిమా టైటిల్ కూడా పవర్ ఫుల్ గా ఉంటుంది. సహజంగానే బాలయ్య సినిమాల టైటిల్స్ అన్నీ పవర్ ఫుల్ గా ఉంటాయి. అందుకే బోయపాటి – బాలయ్య సినిమా టైటిల్ పై ఇప్పటికే అనేక రూమర్స్ వచ్చాయి. ఆ మధ్య ‘మోనార్క్‌’ అనే టైటిల్‌ బాగా వినిపించింది. ఇప్పుడు ఈ సినిమాకి ‘టార్చ్ బెర్రర్’ అనే టైటిల్ ఫైనల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

కాగా టార్చ్ బెర్రర్ అనే డైలాగ్ ఎన్టీఆర్ అరవింద సమేతలో బాగా పేలిన సంగతి తెలిసిందే. కథకు ‘టార్చ్ బెర్రర్’ అనే టైటిల్ పర్ఫెక్ట్ గా సరిపోతుందట. అందుకే బోయపాటి కూడా ఈ టైటిల్ పై ఇంట్రస్ట్ గా ఉన్నాడట. అయితే అధికారికంగా ప్రకటించే వరకూ ఆగాల్సిందే . ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్, పూర్ణ నటిస్తున్నారు. మరొక ప్రముఖ నటుడు శ్రీకాంత్ ఇందులో నెగెటివ్ రోల్ చేస్తుండగా ప్రధాన ప్రతినాయకుడు ఎవరనేది ఇంకా బయటపెట్టలేదు టీమ్. ద్వారక క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు