బాలయ్య ఈ సారి సంక్రాంతి మిస్ అయినట్లే !

బాలయ్య ఈ సారి సంక్రాంతి మిస్ అయినట్లే !

Published on Oct 15, 2019 6:58 AM IST

సంక్రాంతి అంటేనే.. బాలయ్య బాబు సినిమా రిలీజ్ అన్న రేంజ్ లో ఉండేది ఒకప్పుడు. కానీ, ఈ సారి సంక్రాంతికి బాలయ్య బాబు సినిమా రిలీజ్ అవ్వట్లేదు. అల్లు అర్జున్, మహేష్ బాబు, కళ్యాణ్ రామ్ లతో పాటు వెంకీమామ, రజిని దర్బార్ సినిమాలు వచ్చే సంక్రాంతికి పోటీలో ఉన్నాయి. ఇప్పటికే బన్నీ – మహేష్ సినిమాలు విడుదల తేదీని ప్రకటించాయి. అయితే బాలకృష్ణ హీరోగా కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో నటిస్తోన్న 105వ చిత్రాన్ని సంక్రాంతికి ప్లాన్ చేసుకోవచ్చు. కానీ బాలయ్య మాత్రం సంక్రాంతికి రిలీజ్ చెయ్యటానికి ఇంట్రస్ట్ చూపించట్లేదు అట. మొత్తానికి బాలయ్య ఈ సారి సంక్రాంతి మిస్ అయినట్లే !

కాగా ఈ చిత్రానికి ‘జడ్జిమెంట్’ అనే టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ టైటిల్ సాఫ్ట్ గా ఉన్నప్పటికీ కథలో బాలయ్య పాత్రకు తగిన టైటిల్ ఇదేనని దర్శక, నిర్మాతలు భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక జైసింహా వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌ర్వాత ఈ హిట్ కాంబినేష‌న్‌ లో రూపొందుతుంది. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న విడుదల చేయనున్నారు. ఇందులో సొనాల్ చౌహాన్, వేదిక కథానాయికలుగా నటిస్తున్నారు. బాలయ్య, రవి కుమార్ కాంబినేషన్లో గత ఏడాది ‘జై సింహ’ అనే డీసెంట్ చిత్రం వచ్చి ఉండటంతో ఈ సినిమాపై అభిమానుల్లో మంచి అంచనాలున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు