ఫ్యాక్షనిస్ట్ గా బాలయ్య.. నిజమేనట !

ఫ్యాక్షనిస్ట్ గా బాలయ్య.. నిజమేనట !

Published on Feb 24, 2020 6:06 PM IST

నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రంలో బాలకృష్ణ ఫ్యాక్షనిస్ట్ గా నటిస్తున్నాడట. అందుకే బాలయ్య గుండు లుక్‌ లో కనిపిస్తున్నాడని తెలుస్తోంది. మొదటి షెడ్యూల్లో ఈ ఫ్యాక్షనిస్ట్ రోల్ కు సంబధించిన పార్ట్ నే షూట్ చేస్తారట.

అలాగే సినిమాలో బాలయ్య కొన్ని సీక్వెన్స్ లో అఘోరాగా కూడా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. సినిమాలో ఎప్పటిలాగే ఇద్దరు బాలయ్యలు కనిపించనున్నారు. ఇక నందమూరి బాలకృష్ణ స్పీడ్ పెంచారు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు. అన్నట్టు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ ప్రటినాయకుడి పాత్ర చేయనున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు