సంక్రాంతికే బాలయ్య సినిమా : రిలీజ్ డేట్ ఫిక్స్!

సంక్రాంతికే బాలయ్య సినిమా : రిలీజ్ డేట్ ఫిక్స్!

Published on Apr 29, 2016 12:03 PM IST

gautamiputrasatakarni
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించనున్న వందో సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’పై ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఏ స్థాయి అంచనాలున్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. గత కొద్దినెలలుగా హాట్ టాపిక్‌గా మారిపోయిన ఈ సినిమా ఈ మధ్యే వైభవంగా సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రారంభమైంది. చారిత్రక నేపథ్య కథ కావడం, విలక్షణ దర్శకుడు క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండడం ఇవన్నీ బాలయ్య వందో సినిమాకు ఇప్పట్నుంచే ఆసక్తి రేకెత్తించాయి. ఇక ఇదిలా ఉంచితే, పకడ్బందీగా ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసిన టీమ్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్‍ను కూడా అలాగే నిర్వహించేలా ఓ ప్లాన్ రెడీ చేస్కొని అప్పుడే విడుదల తేదీని కూడా ప్రకటించేసింది.

జనవరి 12, 2017న సినిమాను విడుదల చేయనున్నట్లు క్రిష్ టీం ప్రకటించింది. మే 9న మొరాకోలో మొదటి షెడ్యూల్ మొదలవుతుంది. ఇక అప్పట్నుంచి మొదలుకొని నిరంతరాయంగా షూటింగ్ పూర్తి చేసి, చెప్పిన టైంకి సినిమాను ప్రేక్షకుల ముందుకు తేనున్నట్లు టీం తెలిపింది. రాజీవ్ రెడ్డితో కలిసి క్రిష్ ఈ సినిమాను స్వయంగా నిర్మిస్తున్నారు. ఎన్నో ప్రత్యేకతలున్న సినిమా కావడంతో 2017 సంక్రాంతికి తమ సినిమా రావాడం అన్ని విధాలా బాగుంటుందని ఇప్పుడే ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ విడుదల తేదీ ప్రకటించేయడం విశేషంగా చెప్పుకోవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు